చిన్నారిని కాపాడేందుకు ప్రపంచం ఏకమైంది

జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు ప్రపంచం మొత్తం ఏకమైంది. ఛత్తీస్ ఘడ్ కు చెందిన యోగేష్ గుప్తా రుపాల్ గుప్తాలు హైదరాబాద్ లో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యగం చేస్తున్నారు. 2018లో వీరికి బాబు జన్మించారు. అయాన్ష్ కు అనారోగ్య సమస్యలతో ఉండటంతో రెయిన్ బో ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. కేస్ స్టడీ చేసిన వైద్యులు స్పైనల్ మస్క్యులర్ అట్రోఫి వ్యాధిగా గుర్తించారు. ఈ రకమైన వ్యాధి ప్రతి పదివేల మంది చిన్నారుల్లో ఒకరికి వస్తుందని డాక్టర్ రమేష్ తెలిపారు. దీనిపై లోతుగా అధ్యయనం చేస్తే గత ఆరు నెలల క్రితం ఈ ఎస్ ఎం ఏ టైప్ 1 వ్యాధికి మెడిసిన్ ఉన్నట్లు కనుగొన్నారు. .ఈ వ్యాధి చికిత్స కోసం ఒక ఇంజక్షన్ ధర 16 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలిసింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే మరో ఆరు కోట్లు అదనం.ఈ ఇంజక్షన్ ఇండియాకు రావాలంటే మొత్తం 22 కోట్ల రూపాయలు కావాలి.. అయితే అంత మొత్తం తమ వద్ద లేదని.. ఎలాగైనా తమ బిడ్డను బ్రతికించుకోవాలని ఆలోచిస్తుండగా …క్రౌడ్ ఫండిగ్ గురించి తెలుసుకున్న అయాన్ష్ తల్లిదండ్రులు నిధుల వేటలో పడ్డారు .క్రౌడ్ ఫండింగ్ నిర్వహిస్తున్న ఇంఫాక్ట్ గురు డాట్ కాం సంస్థను ఆశ్రయించారు . సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు .దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 62 వేల 450 మంది దాతలు 120 రోజుల్లోనే 16 కోట్లు అందించారు. కేంద్ర ప్రభుత్వం మెడిసిన్ ఉన్న సుంకం ఆరు కోట్లను మాఫీ చేసింది. దీంతో సికింద్రాబాద్ రెయిన్ బో ఆసుపత్రిలో బాలుడు అయాన్ష్ కు ఇంజక్షన్ ఇచ్చారు . ప్రస్తుతం అయాన్ష్ ఆరోగ్యం మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. మరో ఆరు నెలల పాటు అయాన్ష్ ఆరోగ్య పరిస్థితిని మానిటర్ చేసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటామని డాక్టర్ రమేష్ తెలిపారు . తన బాబు అయాన్ష్ కు పునర్జన్మ ప్రసాదించిన దాతలకు రుణపడి ఉంటానని అయాన్ష్ తండ్రి యోగేష్ గుప్తా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *