ఘనంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి వార్షికోత్సవ వేడుకలు
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ యొక్క 21వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనం జరిగాయి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ 1980 లలో భూమి పూజ జరిగినప్పటికి నాడు ఏర్పడిన ఈ ఆసుపత్రి పలు ఆటంకాలను తొలగించుకొంటూ ముందుకు సాగాల్సి వచ్చిందన్నారు. అనంతరం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో 2000 వ సంవత్సరములో 100 పడకల హాస్పిటల్ గా సంస్థ ప్రారంభమైనదని తెలిపారు. అలా 100 పడకల హాస్పిటల్ గా ప్రారంభమైన సంస్థ నేడు 550 పడకల స్థాయికి అభివృద్ది చెందిందని చెప్పారు. ఈ క్రమంలో ఎన్నో ఆటంకాలు, అవాంతరాలు దాటుకొని అవార్డులు, మన్ననలు పొందుతూ ముందుకు సాగడానికి యాజమాన్యం, దాతలు, వైద్యులు, సిబ్బంది కృషి ఉందని చెప్పారు. కరోనా కాలంలోనూ తర్వాత బ్లాక్ ఫంగస్ సమస్య తలెత్తినపుడు కూడా సంస్థ వైద్యులు అందించిన చికిత్స అందరి మన్ననలు అందుకొందని బాలకృష్ణ తెలిపారు. ఇదంతా సంస్థలో పని చేస్తున్న అందరి సమిష్టి కృషి కారణంగానే జరుగుతుందని, భవిష్యత్తులో అదే పంథా కొనసాగించాలని సూచించారు.
ఈ కార్యక్రమాలలో శ్రీ నందమూరి బాలకృష్ణ, జెయస్ ఆర్ ప్రసాద్, ట్రస్టు బోర్డు సభ్యులు, BIACH&RI, యం భరత్, ట్రస్టు బోర్డు సభ్యులు సీఈఓ ,డా. ఆర్ వి ప్రభాకర రావు, సీఓఓ రవికుమార్,మెడికల్ డైరెక్టర్ డా. టియస్ రావు,మెడికల్ సూపరింటెండెట్ డా. ఫణి కోటేశ్వర రావు, అసోసియేట్ డైరెక్టర్ డా. కల్పనా రఘునాథ్ లతో పాటూ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు