గ్రేటర్ హైద్రాబాద్ లో పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం
గ్రేటర్ హైద్రాబాద్ లో పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లింగంపల్లి నుంచి బోరబండ తదితర ప్రాంతాల్లో 27 తేదీ నుంచి 28 తేదీ వరకు 24 గంటల పాటు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు జలమండలి అధికారులు తెలిఆపరు . ఈ ప్రాంతంలోని 800 ఎంఎం డయా పీఎస్సీ పైపులైన్ స్థానంలో కొత్తగా 800 ఎంఎం డయా ఎంఎస్ పైప్లైన్ వేయాలని జలమండలి నిర్ణయించింది.
27.01.2022, గురువారం ఉదయం 6 గంటల నుండి మరుసటి రోజు అనగా 28.01.2022, శుక్రవారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయి.
బోరబండ రిజర్వాయర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. 28.01.2022 నాడు నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా నీటి సరఫరా జరుగుతుందని జలమండలి ఒక ప్రకటనలో పేర్కొంది .
నీటి సరఫరా అంతరాయం ఏర్పడే ప్రాంతాలు.
ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 6, 9: బోరబండ, అల్లాపూర్, గాయత్రినగర్, పర్వత్ నగర్, వివేకానందనగర్, ఎస్పీఆర్ హిల్స్, శ్రీరామ్నగర్, కార్మిక నగర్ నీటి సరఫరా 24 గంటల పాటు నిలిపోనుంది.