గ్రేటర్ హైద్రాబాద్ లో దశల వారిగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభం
హైదరాబాద్
గ్రేటర్ హైదరాబాద్ లో 35.31 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన మరో 410 డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్దిదారులకు గురువారం జులై 8వ తేదీన నాడు అందించనున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో 267, ముషిరాబాద్ నియోజకవర్గంలో 143 డబుల్ బెడ్ రూం ఇళ్లను నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటి మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి లు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి లబ్దిదారులకు అందజేయనున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ఎస్.సి.బోస్ నగర్ లో 5.10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 60 డబుల్ బెడ్ రూం ఇళ్లు, 17.90 కోట్ల రూపాయల వ్యయంతో చిలుకలగూడ దోబిఘాట్ లో నిర్మించిన 207 డబుల్ బెడ్ రూం ఇళ్లను శాసన సభ డిప్యూటి స్పీకర్ టి.పద్మారావు లబ్దిదారులకు అందజేయనున్నారు. అదేవిధంగా ముషిరాబాద్ నియోజకవర్గంలో సాయిచరణ్ కాలనీలో 9.34 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 108 డబుల్ బెడ్ రూం ఇళ్లు, టి.అంజయ్యనగర్ కాలనీలో 2.97 కోట్ల రుపాయల వ్యయంతో నిర్మించిన 35 డబుల్ బెడ్ రూం ఇళ్లను రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ లు లబ్దిదారులకు అందజేయనున్నారు. ఈ కార్యక్రమాలకు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటి మేయర్ మోతె శ్రీలతశోభన్ రెడ్డిలతో పాటు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, రాష్ట్ర హోం మంత్రి మహ్మూద్ అలీ తదితరులు హాజరు కానున్నారు.