గ్రహణం మొర్రితో భాదపడుతున్న చిన్నారులకు బసవతారకం స్మైల్ ట్రైన్ పథకం
గ్రహణం మొర్రితో భాదపడే చిన్నారులకు ఇబ్బందులు తొలగించేందుకు బసవతారకం స్మైల్ ట్రైన్ పథకం అందుబాటులోకి వచ్చింది. జన్యుపరమైన ఇబ్బందుల వలన వచ్చే ఈ అంగవైకల్యం వల్ల ఎందరో చిన్నారులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలా ఇబ్బందులు ఎదుర్కొనే చిన్నారుల సమస్యలకు సరైన చికిత్స అందించడం ద్వారా పరిష్కారం చూపవచ్చు.
ఈ దిశగానే బసవతారకం స్మైల్ ట్రైన్ కార్యక్రమాన్ని ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ ముకుంద రెడ్డి నేతృత్వంలో స్మైల్ ట్రైన్ స్వఛ్చంద సంస్థ , బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ఆధ్వర్యంలో సంయుక్తంగా బసవతారకం స్మైల్ ట్రైన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకమైన ఆరోగ్య శిబిరములు ఏర్పాటు చేసి గ్రహణం మొర్రితో భాదపడుతున్న చిన్నారులను గుర్తించి వారికి అవసరమైన శస్త్ర చికిత్స మరియు ఇతరత్రా వైద్య సేవలను బసవతారకం స్మైల్ ట్రైన్ పూర్తిగా ఉచితంగా అందజేస్తోంది. ఇప్పటి వరకూ 3000 కు పైగా చిన్నారులు ఈ కార్యక్రమంలో భాగంగా చికిత్స అందించడం జరిగింది. కరోనా మహమ్మారి కారణంగా బసవతారకం స్మైల్ ట్రైన్ కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో పలువురు చిన్నారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మరలా ఈ ఉచిత సేవలను ప్రారంభించాలని కార్యక్రమ నిర్వాహకులు డా. ముకుంద రెడ్డి నిర్ణయించారు. ఈ ప్రణాళికలో భాగంగా ఈ నెల సోమవారం జూన్ 28 నుండి జూలై 3 వ తారీఖు వరకు ఉచిత వైద్య శిబిరాన్ని బసవతారకం స్మైల్ ట్రైన్ ఏర్పాటు చేసింది. ఈ ఉచిత వైద్య శిబిరంలో గుర్తించబడిన చిన్నారులకు శస్త్ర చికిత్స ఉచితంగా చేయడంతో పాటూ మందులు వంటి వాటిని పూర్తిగా ఉచితంగానే అందించడం జరుగుతుంది
ఇలాంటి ఇబ్బందులతో భాదపడుతున్న చిన్నారుల (ఆరు నెలలు నిండిన వారు) తల్లితండ్రులతో పాటు కొత్తగా చూపించదలచుకొనే వారు , గతంలో శస్త్ర చికిత్స తో పాటూ ఇతరత్రా వైద్య సదుపాయాలు పొందిన తర్వాత కూడా సమస్య పూర్తిగా నయం కాని చిన్నారులు కూడా ఈ శిబిరానికి హజరు కావచ్చు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్యక్రమ నిర్వాహకులు ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ ముకుంద రెడ్డి తెలిపారు.
మరిన్ని వివరాల కోసం తల్లితండ్రులు బసవతారకం స్మైల్ ట్రైన్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్, రోడ్ నెం.10, బంజారా హిల్స్, హైదరాబాదు వద్ద సంప్రదించవచ్చునీ..లేదంటే 9348198804 / 04023551235 నెంబర్లలలో సంప్రదించవచ్చుచ్చన్నారు.