గౌడ కులస్థుల ఆత్మ గౌరవం కోసం కోకపేట లో 5 ఎకరాల భూమిని ,5 కోట్ల రూపాయల ను కేటాయించిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు : తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్

గౌడ కులస్థుల అభివృద్ధికి బాటలు వేసిన టిఆర్ఎస్ పార్టీకే తమ మద్దతు ఉంటుందని తెలంగాణ గౌడ సంఘం స్పష్టం చేసింది. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో గౌడ కులస్థుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేదని అన్నారు. కల్లు విక్రయాలను నిషేధించడంతో అనేక గౌడ కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ మహా నగరంలో కల్లు దుకాణాలను పునరుద్ధరించి తమ కులస్తుల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. స్వేచ్ఛగా కల్లును విక్రయించుకునే అవకాశం ఏర్పడడంతో అనేక కుటుంబాలు ఆర్థికంగా బలపడ్డాయని చెప్పారు. వీటితో పాటు దేశంలో ఎక్కడా లేని విధంగా నీరా పాలసీని రాష్ట్రంలో ప్రవేశ పెట్టారని అన్నారు. గౌడ ఆత్మగౌరవానికి రెండు వందల యాభై కోట్ల విలువైన స్థలాన్ని కేటాయించడంతో పాటు 5 కోట్ల ఆర్థిక సహాయం అందించి అభివృద్ధికి బాటలు వేశారని అన్నారు. కుల వృత్తికి పూర్వ వైభవం తీసుకోవచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కింది. ప్రస్తుత జిహెచ్ఎంసి ఎన్నికల్లో సైతం టిఆర్ఎస్ పార్టీ 18 మంది గౌడ కులస్థులకు టికెట్లు కేటాయించి తమ కులస్తుల పట్ల పార్టీకి ఉన్న ఉదారతను చాటుకున్నారు చెప్పారు. అన్నింటి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న కులస్థులంతా టిఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ కోరారు . ఈ కార్యక్రమంలో తెలంగాణ
గౌడ సంఘాల JAC నాయకులు బాలగోని బాలరాజు గౌడ్, కూరేళ్ళ వేములయ్య గౌడ్, అయిలి వెంకన్న గౌడ్, విజయ్ కుమార్ గౌడ్, గౌడ సంఘాల నాయకులు రాజయ్య గౌడ్, అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *