గుండె సంబంధిత సందేహాలు తీర్చే టోల్ ఫ్రీ నెంబర్ ను విడుదల చేసిన కార్డియాలజీ సొసైటి ఆఫ్ తెలంగాణ

కరోన మహమ్మారి ఇంకా పోలేదని, ఆజాగ్రత్త, నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలను బలి తీసుకుందని,ఎప్పటి లాగే జాగ్రత్తలు పాటించాల్సి అవసరం ఉందని కార్డియాలజీ సొసైటి ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్. కె.నర్సరాజు అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని హార్ట్ హౌస్ లో కార్డియాలజీ సొసైటి ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో డాక్ట ర్స్ డేను పురస్కరించుకొని హృద్రోగ వైద్య నిపుణులు మీడియా తో సమావేశం అయ్యారు.

కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే వాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గమని దీనిపట్ల ఎలాంటి అపోహలకు గురికావద్దన్నారు . కోవిడ్ సమయంలో డాక్టర్లు ప్రాణాలకు తెగించి సేవలు అందించారని అధ్యక్షుడు డాక్టర్. కె నర్సరాజు , ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికాంత్ లు పేర్కొన్నారు. కోవిడ్ తో ప్రాణాలను కోల్పోయిన డాక్టర్లకు డాక్టర్స్ డేను అంకితం చేస్తూ నివాళులర్పించారు.

క కోవిడ్ కష్ట కాలంలో ఆరోగ్యం పైన ఎంతో మంది ప్యానిక్ కి గురవుతున్నారని, పోస్ట్ కోవిడ్ లో హృద్రోగ సమస్యలు కగిలిన వారు, వ్యాక్సిన్, ట్యాబ్లెట్లు తీసుకునే వంటి విషయాల్లో సందేహాలు ఉన్నాయని తెలిపారు. సందేహాలు తీర్చడానికి కార్డియాలజీ సొసైటి ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఉచిత టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 3098 నంబర్ ఈ సందర్భంగా వారు విడుదల చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా కూడా ఆరోగ్యం పై సందేహాల ఉంటే, ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయవచ్చని, డాక్టర్లు అందుబాటులో ఉంటారని చెప్పారు. ఈ సమావేశం లో ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికాంత్ , కోశాధికారి డాక్టర్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి, డాక్టర్ ముకేష్ రావు, డాక్టర్ గురు ప్రకాష్ డాక్టర్ రాజీవ్ గార్గ్, డాక్టర్ నవీన్ కుమార్, భననాధర్, డాక్టర్ సాధిక్ ఆజాంలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *