గిరిజనుల సమగ్ర అభివృద్దిలో యూనివర్సిటీలు భాగస్వామ్యం అవసరం : గవర్నర్ తమిళసై సౌందరరాజన్
గిరిజనులలో పొషకాహార స్థాయిని పెంపొందించేందుకు గవర్నర్ తమిళసై చేపట్టిన కార్యక్రమంలో యూనివర్సిటీలు భాగస్వామ్యం కానున్నాయి. రాష్ట్రంలోని అదిలాబాద్ జిల్లాలోనికొల్లంగ తెగ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొండరెడ్లు, నాగర్ కర్నూల్ జిల్లాలలోని చెంచు తెగలకు చెందిన గిరిజనుల సమగ్ర అభివృద్ధికి పైలెట్ ప్రాజెక్ట్ చేపట్టేందుకు యూనివర్సిటీలను భాగస్వామ్యం చేయనున్నట్లు గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ తెలిపారు . హైదరాబాద్ రాజ్ భవన్ లో యూనివర్సిటీల వీసీలతో , నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, కాళోజీ వైద్య యూనివర్సిటీ, ఈ ఎస్ ఐ మెడికల్ కాలేజ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులతో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ సమావేశమయ్యారు. ఆదిమజాతి గిరిజనుల అభివృద్ధికై తీసుకోవలసిన చర్యల గురించి చర్చించారు. రాజ్ భవన్ ఆధ్వర్యంలో చేపట్టిన సర్వేలో ఆదిమజాతి గిరిజనులకు వ్యవసాయ భూములు, పశువులు, ఇతర వనరులు ఉన్నప్పటికీ వారు వారి భూముల్లోనే కూలీలుగా పని చేస్తున్న విషయాన్ని తెలుసుకున్నారు . వ్యవసాయ విశ్వవిద్యాలయం, హార్టికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ ల సహకారంతో వారికి అవసరమైన శిక్షణ ఇచ్చి, వనరులు సమకూర్చి వారే సొంతంగా వ్యవసాయం, పశుపోషణ, పాడి అభివృద్ధి చేసుకునేలాగా తీర్చిదిద్దాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. గవర్నర్ సెక్రెటరీ కే సురేంద్రమోహన్ ఆదిమ తెగల గిరిజనుల కోసం గవర్నర్ చేపట్టిన కార్యక్రమాన్ని వివరించారు
గిరిరజనుల ఆరోగ్య పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి, అవసరమైన వైద్య సహాయాన్ని అందించడానికి హెల్త్ యూనివర్సిటీ, అలాగే ఈఎస్ఐ మెడికల్ కళాశాల బాధ్యత తీసుకోవాలని గవర్నర్ సూచించారు. గిరిజనుల ఆరోగ్య స్థాయి, పోషణ స్థాయిలను పెంపొందించిడం, ఇతర నైపుణ్య శిక్షణ లు ఇవ్వడం , అవసరమైన ఇన్పుట్స్ సమకూర్చి నప్పుడు వారు ఆర్థికంగా, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా ,.సామాజికంగా అభివృద్ధిని సాధిస్తారని గవర్నర్ వివరించారు. ఈ కార్యక్రమాలు ఒక నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేసి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చోట్ల చేపట్టడానికి స్ఫూర్తిగా నిలవాలని గవర్నర్ పిలుపునిచ్చారు. గిరిజన సంక్షేమం కోసం చేపట్టాల్సిన చర్యలపై తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపిరెడ్డి, ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ప్రొఫెసర్ వి వెంకటరమణ లు పాల్గొని తమ సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ప్రవీణ్ రావు, వైద్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కరుణాకర్ రెడ్డి, హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత, సైంటిస్ట్ శ్రీనివాస్, ఈఎస్ఐ మెడికల్ కళాశాల డీన్ డాక్టర్ శ్రీనివాస్, రెడ్ క్రాస్ ప్రతినిధులు మదన్ మోహన్ రావు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
గవర్నర్ సెక్రెటరీ కే సురేంద్రమోహన్ ఆదిమ తెగల గిరిజనుల కోసం గవర్నర్ చేపట్టిన కార్యక్రమాన్ని వివరించారు.