గాంధీజీ వర్ధంతికి టిడిపి అధినేత చంద్రబాబు నివాళి

మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు నివాళులు అర్పించారు. హైదరాబాద్ లోని తన నివాసంలో గాంధీజీ చిత్ర పటానికి పూలు వేసి నివాళులు ఘటించారు. భారత దేశ స్వాతంత్య్ర పోరాటంలో అహింసా వాదాన్నే జాతి నినాదంగా మలిచిన మహనీయులు గాంధీజీ అని చంద్రబాబు అన్నారు. చిత్తశుద్దితో న్యాయం కోసం చేసే పోరాటానికి ఎంతటి నిరంకుశత్వమైనా తలవంచక తప్పదని మహాత్ముడు నిరూపించారని కొనియాడారు. గాంధీజీ సూక్తి ప్రతి తరానికి నిత్య స్ఫూర్తి గా నిలుస్తుందన్నారు. ఫాదర్ ఆఫ్ ది నేషన్ గాంధీజీ వర్థంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.