గణతంత్ర దినోత్సవం భారతీయులందరు గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన రోజు : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్
గణతంత్ర దినోత్సవం భారతీయులందరు గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన రోజు : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్ x రోడ్ బిజెపి కార్యాలయం వద్ద
ఘనంగా నిర్వహించారు . బిజెపి డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు ఆధ్వర్యంలో జాతీయ జండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు.ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో జనవరి 26, 1950వ సంవత్సరం భారతీయులందరం గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన రోజు అని అన్నారు.200 సంవత్సరాల పాటు బ్రిటీష్‌వారి పరిపాలనలో మన దేశాన్ని పరిపాలించారు అని అన్నారు.రిపబ్లిక్ డే అనగానే అందరికి టక్కున గుర్తుచ్చే రోజు జనవరి 26, 1950.దేశ చరిత్రలో ఈ రోజుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. 200 సంవత్సరాల పాటు బ్రిటీష్ పరిపాలనకు చరమగీతం పాడుతూ ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా 1947 ఆగస్టు 15న తెల్లదొరల పాలన నుంచి విముక్తి చెందిన భారతదేశం స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది అని అన్నారు. బ్రిటీష్ వాళ్లను వెళ్లగొట్టిన తరువాత మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం అని అన్నారు.దేశ రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 1947 ఆగస్టు 28న రాజ్యాంగ నిర్మాణ కమిటీ ఏర్పాటైంది అని అన్నారు.చెప్పడానికి ఎంతో సంతోషకరమైన విషయం ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యాంగాల్లో మనరాజ్యాంగం ఒకటి. దేశపౌరుల హక్కులను పరిరక్షించడంలో, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ ను నిలపడంలో రాజ్యాంగం మహోన్నత పాత్ర పోషించింది. ఇంతటి గొప్ప రాజ్యాంగాన్ని మనకందించిన మహనీయులను స్మరించుకుంటూ దేశపౌరులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.తదనంతరం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పాల్గొని జండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు యోగనంద్, జిల్లా ఉపాధ్యక్షులు బుచ్చిరెడ్డి, సీనియర్ నాయకులు నాగుల్ గౌడ్,మహేష్ యాదవ్,రమేష్ సోంశెట్టి,శ్రీశైలం కురుమ,మనోహర్,రవి గౌడ్, వర ప్రసాద్,జితేందర్, కోటేశ్వరరావు, మణిక్ రావు,విజేందర్, పృథ్వి కాంత్,బాబు రెడ్డి, లక్ష్మణ్,నారాయణరెడ్డి,జగన్,సిద్దు, నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.