కొత్త జిల్లాలు ఎలా వచ్చాయో..అలాగే మూడు రాజధానులు : మంత్రి అవంతి శ్రీనివాస్
*కొత్త జిల్లాలు ఎలా వచ్చాయో..అలాగే మూడు రాజధానులు : మంత్రి అవంతి శ్రీనివాస్* *విశాఖపట్నం : రాష్ట్రంలో కొత్తగా 26 జిల్లాలు ఎలా వచ్చాయో, అలాగే మూడు రాజధానులు వస్తాయని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశాలు లేవని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. అందుకే ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టామని ఆయన తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు చంద్రబాబు అనుకూలమో, కాదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయం ఉద్యోగస్తుల ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించడానికే అన్నది అవాస్తవమని మంత్రి అవంతి పేర్కొన్నారు.*