కొత్త జిల్లాలతో పాటుగా పెరిగిన రెవిన్యూ డివిజన్లు

కొత్త జిల్లాలతో పాటుగా పెరిగిన రెవిన్యూ డివిజన్లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుతో రెవెన్యూ డివిజన్ల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయల సీమ జిల్లాల్లో 50 రెవెన్యూ డివిజన్లు ఉంటే కొత్తగా ప్రతిపాదించిన జిల్లాల్లో మరో 13 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశారు. మొత్తం కొస్తాంధ్ర ,రాయ‌ల‌సీమలో 63 రెవెన్యూ డివిజ‌న్లు ఏర్పాటు కానున్నాయి. అన్నమయ్య జిల్లాలో రాయచోటి, బాపట్ల జిల్లాలో బాపట్ల, చీరాల రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు అయ్యాయి. చిత్తూరు జిల్లాలో కొత్తగా పలమనేరు రెవెన్యూ డివిజన్, అలాగే ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, తిరువూరు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు.. ప్రకాశం జిల్లాలో పొదిలి రెవెన్యూ డివిజన్ శ్రీ సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి రెవెన్యూ డివిజన్ కొత్తగా ఏర్పాటు అయ్యింది. విశాఖపట్నం జిల్లాలో భీమునిపట్నం రెవెన్యూ డివిజన్ , విజయనగరం జిల్లాలో కొత్తగా బొబ్బిలి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో కొత్తగా భీమవరం రెవెన్యూ డివిజన్ , నంద్యాల జిల్లాలో డోన్, ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్లు ఇచ్చింది. కొత్తవాటితో కలిపి ఏపీలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 63కు పెరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *