కెసిఆర్ మోసగాడు: మాజీ ఎంపీ ,బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి

టిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి కి కేరాఫ్ అడ్రస్ గా మారిందని బిజెపి సీనియర్ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. శేరిలింగంపల్లి లో రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి అధ్యక్షతన జరిగిన రంగారెడ్డి అర్బన్ జిల్లా కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీనివాసులు , మాజీ ఎంపీ శ్రీ ఏపీ జితేందర్ రెడ్డి , జిల్లా ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ , ఖాదీ బోర్డ్ మెంబర్ పేరాల శేఖర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

కార్యక్రమంలో జితేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ టీ.అర్.ఎస్ ప్రభుత్వ మోసాల పై, వైఫల్యాల పై విరుచుకుపడ్డారు. ధనిక రాష్ట్రం గా ఉన్న తెలంగాణ ని కెసిఆర్ కుటుంబం అంత కలిసి దోచుకొని అప్పుల తెలంగాణ గా మార్చారని విమర్శించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు కేవలం కమిషన్ పథకాలు గా తయ్యారయ్యయని ఎద్దేవా చేశారు.

దుబ్బాక, GHMC ఎన్నికల ఫలితాలు కెసిఆర్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయని, ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక భయం పట్టుకుందని అందుకే విచ్చలవిడిగా మందు, డబ్బులు పంపిణీ చేసి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కానీ హుజూరాబాద్ ప్రజలు, యువత కెసిఆర్ కి దుబ్బాక లో బుద్ది చెప్పినట్టు గానే ఇక్కడ కూడా చెప్తారని, బీజేపీ నీ అధిక ఆధిక్యం తో గెలిపిస్తారని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

హుజూరాబాద్ బీజేపీ గెలుపు కై ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికునిలా పని చేసి ప్రతి ఎన్నికల్లో బీజేపీ ని గెలిపించాలని, ఇదే గెలుపు పరంపరను కొనసాగిస్తూ గోల్కొండ ఖిల్లా పైన బీజేపీ జెండా ఎగురవేయాలని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడం జరిగింది.

నిరు పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇల్లు ఇవ్వాలని…అర్హులైన ప్రతీ ఒక్క నిరు పేదకు రేషన్ కార్డులు అందించాలన్నారు. ప్రైవేట్ హాస్పిటళ్లలో ఫీజులు నియంత్రించి, ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ, దేవాదాయ భూముల అన్యాక్రాంతం / కబ్జాలు వాటిని రక్షించ వలసిన చట్టాలు తీసుకురావాలన్నారు. ఇంటి నంబర్లను క్రమబద్ధీకరించాలని..నగర చెరువులు – యాజమాన్య నిర్లక్ష్యంపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పురపాలక ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు అమలుపరచాలని తీర్మానాలు చేయడం జరిగింది.

కార్యక్రమం లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, కళ్లెం రవీందర్ రెడ్డి, శ్రీ రాములు యాదవ్, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి గజ్జల యోగానంద్, జిల్లా ప్రధాన కార్యదర్శులు వై శ్రీధర్, చింతకింది గోవర్ధన్ గౌడ్, మహిళ మోర్చ రాష్ట్ర కార్యదర్శి శ్యామల, రాష్ట్ర దళిత మోర్చ అధికార ప్రతినిధి శ్రీమతి కాంచన కృష్ణ, రంగారెడ్డి అర్బన్ జిల్లా లోని డివిజన్ అధ్యక్ష్యులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా పథాదికారులు, రాష్ట్ర పథాదికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *