కృష్ణా జలదోపిడిని అడ్డుకుందాం : తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం

కృష్ణా జిల్లాల నీటి కేటాయింపులో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, జల దోపిడీపై వివిధ రాజకీయ పక్షాలు, ఉద్యమ సంస్థలు, ప్రజాసంఘాలు గలమెత్తాయి. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో టీ జర్నలిస్టుల ఫోరమ్ (TJF) అధ్యక్షుడు పల్లె రవికుమార్ అధ్యక్షతన ‘కృష్ణా జలాలు న్యాయమైన వాటా- పెండింగ్ ప్రాజెక్టులు సత్వరం పూర్తి’ అనే అంశంపై వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నేతలు, ఉద్యమ సంస్థల నాయకులతో అఖిలపక్ష సమావేశం జరిగింది.
తెలంగాణ ఏర్పాటులో నీళ్లు, నిధులు, నియామకాలు అనే 3 అంశాలు ట్యాగ్ లైన్ గా ఉద్యమాలు సాగాయని.. ఈ మూడింటిలో ప్రధానమైన నీటి కేటాయింపుల అంశం ఇంకా వివాదాస్పదంగా నే కొనసాగుతోదని వక్తలు అన్నారు. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని చెప్పిన మాటలన్నీ కల్లబొల్లి కబుర్లు గానే మిగిలిపోయాయన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పేరుతో అక్రమ ప్రాజెక్టును చేపట్టినా.. ఈ ప్రాజెక్టు సంబంధించిన గ్రౌండ్ వర్క్ గత ఏడాది కాలంగా సాగుతున్నా.. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్ వ్యవహార శైలిని అఖిలపక్షం నాయకులు ముక్త కంఠంతో ఖండించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఫ్లోరైడ్ సమస్య తీరుతుందని… తండాలోని పిల్లలు అమ్మకాలు ఆగుతాయి అనుకున్నామని, సీఎం కేసీఆర్ తో ఏ ఒక్కటి సాకారం కాలేదని విమర్శించారు. కృష్ణా నది తెలంగాణలో 68 శాతం 32 శాతం ఇస్తున్నప్పటికీ నా వాటా కేవలం 290 ఎంసీ లేనని.. ఆంధ్రోళ్లు నీటిని తరలించే పోతున్నప్పటికీ తెలంగాణ సర్కారు చూస్తూ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. మన నీటి కేటాయింపుల అవసరాలకు అనుగుణంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ సమాజానికి స్పష్టం చేశారు.
టీ జే ఎస్ అధ్యక్షుడు కోదండరాం

పోలవరం విస్తరణను ఆపాలని ఆనాడు మీటింగ్ పెట్టాం… ఇపుడు ఆరోజు ఒక రాజకీయ అవసరం నడిపిస్తే ఈరోజున వేరే అవసరం ఉన్నట్లుండి.. అంతే కానీ నీటి వాటాలో అసమానతలు ఎక్కువయ్యాయి.. కానీ తెలంగాణ వచ్చాక అయిన పరిస్ధితులు మారుతయంటే అది లేదు… శ్రీశైలం నుండి నుండి నీళ్లు తీసుకోవచ్చు… కల్వకుర్తి పెంచుకోండి అంటే ప్రాజెక్ట్ రీ డిజైన్ చేయడం కుదరదు అన్నారు .

వివేక్ బీజేపీ నేత

కృష్ణా నీటి వాటలపై ఇంత అన్యాయం జరుగుతున్న కేసీఆర్ గమ్మున ఉండటానికి కమిషన్ కారణమన్నారు బీజేపీ నేత వివేక్. బాచవత్ ట్రిబ్యునల్ ప్రకారం పంపకాలు జరగాలని.. నీరు అటు వైపు పోవడం తెలంగాణ ఎడారిగా మారుతుందన్నారు.

బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి

కెసిఆర్ కి అధికారం ఇవ్వటమే తెలంగాణ ప్రజలు చేసిన పెద్ద తప్పుని ..ఆయనకి కుటుంబ పాలనపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదన్నారు బీజేపీ నేత జితేందర్ రెడ్డి. ఉమాభారతి తో జరిగిన మీటింగులో 812 టీఎంసీ ల డివైడ్ చేసినపుడు 299 టీఎంసీల ఒప్పుకోవడం. 545 టీఎంసీ లు రావాల్సిన దగ్గర 299 టీఎంసీ లకు ఒప్పుకున్నాడు .అదే పెద్ద తప్పున్నారు.

దొంతుల లక్ష్మీనారాయణ తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం కన్వీనర్

సీఎం కేసీఆర్ ఏళ్ల పాలనలో కృష్ణా జలాల గురించి ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవని తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం కన్వీనర్ దొంతుల లక్ష్మీ నారాయణ మండిపడ్డారు. తెలంగాణ వచ్చేనాటికే 97 లక్షల 55 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రాజెక్టులు, ప్రస్తుత ప్రాజెక్టుల పరిస్థితులపై అధ్యయనం చేసిన ఆయన.. నేటి వరకు కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులపై తెలంగాణ నేటి వాటాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలతో సీఎం కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆయన తనదైన శైలిలో ఇంజనీర్ లక్ష్మీనారాయణ విరుచుకుపడ్డారు.

బీజేపీనేత, స్వామీ గౌడ్

ఆనాడు తెలంగాణ ఉద్యమం లో కోరిన కోరికలు ఈనాడు స్వరాష్ట్రలో నెరవేరడం లేదని శాసనమండలి మాజీ ఛైర్మెన్ స్వామి గౌడ్ అన్నారు.ఇరిగేషన్ మాత్రమే కాకుండా, పోడు సమస్యలు, నిరుద్యోగుల సమస్యలపై మనం దృష్టి సారించాలన్నారు.

మల్లురవి…కాంగ్రెస్ నేత

రాష్ట్రంలో ప్రభుత్వం అవినీతి మయంలో కూరుకపోయిందని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. చివరకు నీళ్ల పంపకాల విషయంలో సీఎం పట్టించుకోవడం మానేశాడన్నారు. రాష్ట్రంలో ఎవరు మాట్లాడకుండా చేస్తున్నారు. ఎం కార్యక్రమాలు చేయాలన్న వాళ్ళ పర్మిషన్ తీసుకొనే పరిస్థితి వచ్చిందన్నారు.

శ్రావణ్. ఏఐసిసి అధికార ప్రతినిధి

ఏ ఉద్యమ లక్ష్యం కోసం పనిచేసినమో అది కొద్దిగా కూడా జరగడం లేదని ఏఐసీసీ కార్యదర్శి శ్రావణ్ అన్నారు.

చెరుకు సుధాకర్, ఇంటిపార్టి అధ్యక్షుడు

వందల మంది జీవితాలు జైల్లో మగ్గి, ఆత్మ బలిదానాలు చేస్తే ఈరోజు తేరగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్ విమర్షించారు.
అసలు క్యూసెక్కు లు, టిఎంసి లు అంటే అర్థం తెలియని మంత్రులు కూడా సీఎం చెప్పినట్లు కృష్ణా జలాల పై మాట్లాడుతూ గాడిధల్ల ప్రవర్తిస్తున్నారన్నారు.
సమైక్య రాష్ట్రంలో జరిగిన పనులే తప్ప కెసిఆర్ చేసిందేమీ లేదు… వాటి పేరుతో డబ్బులు దండుకుంటున్నారని చెప్పారు.
కెసిఆర్ ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి విపక్షాలన్నీ తగిన కార్యాచరణ ముందుకు పోవడానికి సంసిద్ధం కావాలన్నారు.
కాంగ్రెస్ నేత సంపత్

ప్రాజెక్టుల విషయలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనీ కాంగ్రెస్ నేత సంపత్ అన్నారు.

శాసన సభ సాక్షిగా ఏపీ సీఎం జగన్ ను చెప్పిన మాటలు తెలంగాణ సీఎం కెసిఆర్ పట్టించుకోకపోవడం ఎంటిని ప్రశ్నించారు.
దక్షిణ తెలంగాణా ఎడారైపోతుందే చూడలేక కేంద్రం జలశక్తి శాఖకు లేఖ ఇచ్చాం… కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క అభ్యంతరం కేంద్రానికి ఇవ్వలేదన్నారు.

అఖిలపక్ష సమావేశంలో పాల్గొని, ప్రతిపాదించిన తీర్మానాలు.
1) పరివాహక ప్రాంత దామాషా ప్రకారం తెలంగాణ వాటా కృష్ణా నది నుండి దక్కాలి.
2) నది జలాల పంపకంపై అంతర్జాతీయ, జాతీయ సంస్థల ఆధారంగా తొలుత పరివాహక ప్రాంత అవసరాలు తీరిన తర్వాతనే ఇతర ప్రాంత అవసరాలకు వినియోగించాలి. పరివాహక ప్రాంతంలోని వెనుకబడిన జిల్లా పాలమూరు ఫ్లోరైడ్ పీడిత జిల్లా నల్లగొండ, రంగారెడ్డి ఆకలిచావులు ఆత్మహత్యలు నివారించకుండా.. మనుషులు పశువులు చిక్కం గట్టి ఏపీకి తరలించే దుర్మార్గాన్ని అరికట్టాలి.
3) కృష్ణా నదిపై పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి.
4) కాసులు, కాంట్రాక్టులు రాజకీయ అవసరాల ఆధారంగా ప్రాజెక్టును రూపొందించకుండా ప్రజా ప్రయోజనాల ఆధారంగా ప్రాజెక్టులు రూపొందించి పూర్తి చేయాలి.
5) నదీజలాల్లో వాటాను సాధించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులు, అదేవిధంగా తెలంగాణ ప్రాజెక్టులు కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చుపై శ్వేత పత్రం విడుదల చేయాలి.
6) రాష్ట్ర ప్రాజెక్టులు, జలాల విషయంలో తెలంగాణలోని రాజకీయ పార్టీలు, ఉద్యమ సంస్థలను కలుపుకుని కేంద్ర ప్రభుత్వంపై వెంటనే ఒత్తిడి చేయాలి. నీటి పంపకాల విషయంలో ప్రజలమధ్య వైరుద్యాలు పెరుగకుండా రెండు ప్రాంతాల ప్రజాస్వామిక వాదులతో సహృదయ కమిటీని వేసేలా ప్రయత్నిద్దాం..
7) ఆంధ్ర ప్రదేశ్ కాంట్రాక్టర్లు, ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా కుమ్మక్కయిందనే అనుమానాలను వెంటనే నివృత్తి చేయాలి.

ఈ సమావేశంలో తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రోఫెసర్ ఎం.కోదండరాం, తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, ఎంపీ, బిజెపి నేత వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ, బిజెపి నాయకులు జితేందర్ రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, ఏఐసీసీ కార్యదర్శి, మాజీ శాసనసభ్యుడు సంపత్ కుమార్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, సీపీఐ నాయకులు ఉజ్జిని రత్నాకర్ రావు, బాల మల్లేష్, అరుణదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్స్ అసోసియేషన్ సలహాదారుడు, తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు సిలివేరు కాశినాధం, తెలుగు మహిళా అధ్యక్షురాలు ప్రొఫసర్ జ్యోస్నా, మాజీ రిటైడ్ చీఫ్ ఇంజినీర్ ఎం. సత్తిరెడ్డి, ఇంజినీర్స్ ఫోరమ్ కన్వీనర్ డి. లక్ష్మీనారాయణ, తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు అంబటి నాగయ్య, జై స్వరాజ్ పార్టీ అధ్యక్షులు కాసాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *