కిక్ బాక్సింగ్ గేమ్ కు ఇండియన్ స్పోర్ట్స్ మినిస్ట్రీ గుర్తింపు

కిక్ బాక్సింగ్ గేమ్ కు ఇండియన్ స్పోర్ట్స్ మినిష్ట్రీ గుర్తింపును ఇవ్వడం హర్షించదగ్గవిషయమని తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు సీ.రామాంజనేయులు , ప్రధాన కార్యదర్శి యమ్.మహిపాల్ లు అన్నారు . దేశంలో ఎంతో ప్రఖ్యాతి గాంచిన కిక్ బాక్సింగ్ క్రీడకు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ , ఇండియన్ స్పోర్ట్స్ మినిస్ట్రీ గుర్తింపు ఇవ్వడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. కిక్ బాక్సింగ్ గేమ్ కు గుర్తింపుగా ఇచ్చిన నేపథ్యంలో ఎల్బీ స్టేడియంలోని స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ ఛాంబర్ లో స్పోర్ట్స్ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి , ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జగదీష్ యాదవ్ స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు , జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు ..

రానున్న రోజుల్లో రాష్ట్రంలో కిక్ బాక్సింగ్ క్రీడను గ్రామీణ స్థాయి వరకు తీసుకెళ్లాలని తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు సీ.రామాంజనేయులు అన్నారు . పెద్ద ఖర్చుతో కూడుకున్న గేమ్ కాదని.. క్రీడాకారులను ఈ గేమ్ లో భాగస్వాములు చేసి జాతీయ కిక్ బాక్సింగ్ జట్లకు ఎంపికై ఒలింపిక్స్ క్రీడలు గాని, ఏసియన్ గేమ్స్ లో గాని పాల్గొనే విధంగా చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం నుండి కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి తెలియజేశారు.

ఈ కిక్ బాక్సింగ్ క్రీడకు అధికార గుర్తింపు వచ్చిన సందర్భంగా త్వరలో కిక్ బాక్సింగ్ జాతీయ స్థాయి టోర్నమెంట్ ఒకటి హైదరాబాదులో నిర్వహించాలని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి తెలంగాణ కిక్ బాక్సింగ్ సభ్యులను కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు సీ.రామాంజనేయులు మరియు ప్రధాన కార్యదర్శి యమ్.మహిపాల్, ఉపాధ్యక్షులు బాలాజీ, సంయుక్త కార్యదర్శి నర్సింగ్ రావు, కోశాధికారి శ్రీనివాసు, కార్యవర్గ సభ్యులు ప్రవీణ్, తిరుపతి, శివ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *