కల్పన ఫార్మసీలో దవ ఇండియా ఉత్పత్తులు ను ఆవిష్కరించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్ పేట్ లో నూతనంగా ప్రారంభించిన కల్పన ఫార్మాసిలో దవ ఇండియా ప్రోడక్ట్స్ ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ యొక్కవ ఇండియా ప్రోడక్ట్స్ నేటి నుండి అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంటాయన్నారు.అలాగే కస్టమర్లు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివేకానంద సేవ సమితి ఉపాధ్యక్షులు పృథ్వి కాంత్, దీపక్ మరియు తదితరులు పాల్గొన్నారు.