కలర్ ఫుల్ గా సాగిన కిడ్స్ ఫ్యాషన్ షో
హైదరాబాద్
ఆట,పాట, సంగీతం, క్యాట్‌వాక్‌తో లిటిల్ కిడ్స్ అదరగొట్టారు . చిన్నారులల్లో దాగియున్న ప్రతిభను వెలికితీసి…వారి ప్రోత్సహించేందుకు ఫిప్త్ అవెన్యూ ఈవెంట్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యాషన్ షో కలర్ ఫుల్ గా సాగింది.
హైదరాబాద్ హైటెక్స్ లో జరగనున్న హైదరాబాద్ కిడ్స్ ఫెయిర్ లో ప్రతిభ కనబర్చిన చిన్నారులకు బహుమతులు అందజేస్తామని నిర్వహకులు తెలిపారు .దీనికి సంబంధించిన హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన కర్టన్ రైజర్ ఈవెంట్ లో సినీ నటి దీక్షపంత్ కిడ్స్ ఫ్యాషన్ షోకు సంబంధించిన బ్రోచర్ ను ఆవిష్కరించారు.
చిన్నారులను ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని సినీ నటి దీక్షపంత్ అన్నారు. పిల్లల్లో ఎంతో ప్రతిభ ఉంటుందని…దానిని గుర్తించి అవకాశాలు కల్పిస్తే రాణించగలరన్నారు. నృత్యం, సంగీతం, ఫ్యాషన్ ఇలా ఆయా రంగాల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు అవకాశాలు కల్పించడం ఆనందంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా ఫ్యాషన్ షో, డ్యాన్స్, సంగీతం తదితర అంశాలు చిన్నారులు ప్రదర్శించి మెప్పించారు. ప్రొఫెషనల్ మాదిరి చిన్నారులు ర్యాంప్‌పై బుల్లిబుల్లి అడుగులు వేస్తూ….వీక్షకులను మంత్రముగ్దులను చేశారు. నేటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ఫిప్త్ అవెన్యూ ఈవెంట్ మేనేజ్‌మెంట్ ఎండీ ఆదామి తెలిపారు. నెల రోజుల పాటు ఆయా
ప్రాంతాల్లో ఆడిషన్స్ నిర్వహిస్తామని…డిసెంబర్ మాసంలో ఫైనల్ ఫోటీలు నిర్వహించనున్నట్లు ఆమె వివరించారు.