కలర్ ఫుల్ కలెక్షన్ తో తళుక్కుమన్న మాళవిక శర్మ
హైదరాబాద్
ఇండియన్ అండ్ వెస్ట్రన్ వేర్ డిజైనర్ దుస్తులు అంటే తనకు ఎంతో ఇష్టమని తనకెంతో ఇష్టమని సినీ నటి మాలవిక శర్మ అన్నారు .హైదరాబాద్ నోవాటెల్‌లో ఏర్పాటు చేసిన హైలైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్‌ను మోడల్స్‌తో కలిసి ఆమె ప్రారంభించారు .ఫ్యాషన్ లవర్స్‌కు కావల్సిన అన్ని రకాల డిజైనరీ వస్త్రాలను ఒకే చోట అందుబాటులో ఉంచిన నిర్వహకులను ఆమె అభినందించారు.
పెళ్లిళ్లు , శుభకార్యాలకు ఇతర కార్యక్రమాలకు కావలసిన అన్ని రకాల మోడ్రన్ డిజైన్ కలెక్షన్లను ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించారు. నేటి యువతరం అభిరుచులకు అనుగుణంగా సరికొత్త డిజైన్స్ ను హై లైఫ్ డిజైనరీ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ లో అందుబాటులోకి వచ్చిందని నిర్వాహకులు తెలిపారు .మోడల్స్ న్యూ కలెక్షన్స్ తో అదుర్స్ అనిపించారు. ఈ ఎగ్జిబిషన్ 7వ తేదీ వరకు కొనసాగనుంది.