కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడడంలో వైద్యుల పాత్ర కీలకం: డాక్టర్ కోటేశ్వర ప్రసాద్
ప్రాణాలు పోసేది కనిపించని దేవుడు అయితే… ఆ ప్రాణాలను నిలిపేది మాత్రం కనిపించే దేవుడు డాక్టర్ అని రెనొవా ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ కోటేశ్వర ప్రసాద్ అన్నారు.హైదరాబాద్ సనత్ నగర్ రెనొవా ఆసుపత్రిలో జాతీయ వైద్యుల దినోత్సవంను పురస్కరించుకుని కరోనా రోగులకు సేవలందించిన వైద్యులు ,సిబ్బందిని సన్మానించారు.
జనం ప్రాణాలను కాపాడడం కోసం తమ కుటుంబాలను, తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిత్యం రోగుల సంక్షేమం కోసం పరితపించే వారే వైద్యులు ఆయన అన్నారు .
కరోనా మహమ్మారి ఈ ప్రపంచాన్ని కబళిస్తున్న సమయంలో వైద్యుల గొప్పతనం తెలిసిందన్నారు. కరోనా సోకిన వారిని కుటుంబాలు, తమ సొంత మనుషులే పట్టించుకోవడానికి భయపడుతూ దూరం పెట్టిన సందర్భంలో కూడా డాక్టర్లు వారికి వైద్యం చేసి, ధైర్యం చెప్పి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చి వారి కుటుంబానికి దగ్గర చేసిన గొప్ప వ్యక్తులు వైద్యులు అని కీర్తించారు.
అందుకే కే వైద్యో నారాయణ హరి అన్నారు. ప్రజలకు వారి ఆరోగ్యం పట్ల ధీమా కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. వైద్యుల పట్ల ఎవరైనా అనుచితంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు చేపడుతూ వైద్యుల అండగా ఈ ప్రభుత్వం ఉందని చాటి చెబుతున్నారని తెలిపారు. వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రెనొవా ఆసుపత్రి సీఓఓ శాంతి , రెనోవా ఆసుపత్రి వైద్యులు నీలిమాతో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు