కంప్యూటర్ కోర్సులు ఉచిత శిక్షణ
నేషనల్ కంప్యూటింగ్ కౌన్సిల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో పేస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ద్వారా ఆన్ లైన్ లో ఉపాధి అవకాశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ విమలా రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన విద్యార్థినీ విద్యార్థులు, నిరుద్యోగులు, ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. టెన్త్ ,ఇంటర్ డిగ్రీ ,ఇంజనీరింగ్, విద్యార్థులు, నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని ఆమె తెలిపారు.
డిప్లమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, పీజీ డిప్లమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, డిప్లమా ఇన్ కంప్యూటర్ అకౌంటెన్సీ అండ్ టాలీ , మాస్టర్ డిప్లమా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ , కంప్యూటర్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ మొదలగు కోర్సుల్లో ఆన్ లైన్ ద్వారా నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. ఆన్లైన్ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ ,బిసి, మైనారిటీ, ఓబిసి ,ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులు ,వికలాంగులు, పదవీ విరమణ చేసిన సైనికులు, మహిళా అభ్యర్థులు కోర్సు ఫీజు ఉచితంఅని ఆమె ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు www.pacecomputers.org వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
జులై నెల 24వ తేదీ లోగా దరఖాస్తులు ఆ వెబ్ సైట్లో పంపించాలని కోరారు .మరిన్ని వివరాలకు 9505800042 నంబర్లు సంప్రదించవచ్చు