ఏపీ టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

అమరావతి :

ఏపీలో పదోతరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటించింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షల జరగనున్నాయి.

షెడ్యూల్‌ ఇలా : ఏప్రిల్‌ 3- ఫస్ట్‌ లాంగ్వేజ్‌, ఏప్రిల్‌ 6- సెకండ్‌ లాంగ్వేజ్‌, ఏప్రిల్ 8- ఇంగ్లీష్‌, ఏప్రిల్‌ 10- మ్యాథ్స్‌, ఏప్రిల్‌ 13- సైన్స్‌, ఏప్రిల్‌ 15- సోషల్‌ స్టడీస్‌, ఏప్రిల్‌ 17- కాంపోజిట్‌ కోర్సు, ఏప్రిల్‌ 18- ఒకేషనల్‌ కోర్సు పరీక్షలు జరుగుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *