ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు
ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల ను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు . విద్యార్థులకు మార్కులు ఎలా ఇవ్వాలన్న దానిపై హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. హై పవర్ కమిటీ నివేదిక మేరకు మార్కులపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రభుత్వం కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించడానికి ప్రయత్నించామన్నారు.సుప్రీం ఆదేశాల ప్రకారం జులై 31 నాటికి పరీక్షల నిర్వహణ సాధ్యం కాదు అన్నారు. విద్యార్థులు నష్టపోకూడదనే పరీక్షల రద్దు నిర్ణయం తీసుకున్నామన్నారు .ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయ లోపం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు