ఎల్ఆర్ఎస్ దరఖాస్తు రుసుము తగ్గించేందుకు చర్యలు తీసుకుంటాం – సీఎం కేసీఆర్
తెలంగాణ నూతన రెవెన్యూ చట్టం, లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీంలపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు వివరించారు. హైదరాబాద్ ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. సామాన్య మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఎల్ఆర్ఎస్ రుసుము తగ్గించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ను కోరగా….సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది . భూ సర్వే ఈ నెల 15 వ తేదీ వరకు సరిపోదని..గడువు పెంచాలని సీఎం కేసీఆర్ను ఎమ్మెల్యేలు కోరారు. అవసరాన్ని బట్టి సమయం పెంచేవిధంగా నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పినట్లు తెలుస్తోంది. గ్రామాల్లోని అన్ని రకాల భూములు ఆన్లైన్ రికార్డులలోకి ఎక్కించేలా చర్యలు తీసుకోవాలన్నారు .
రెవెన్యూ చట్టంపై ప్రజలకు భయాలు ఉంటే తొలగించేలా అవగాహన కల్పించాలని సీఎం సూచించారు .