ఆహార పదార్థాలను కల్తీ చేస్తే కఠిన చర్యలు తప్పవు: రాష్ట్ర ప్రభుత్వం ఆహార పదార్థాల కల్తీ నియంత్రణ కమిషనర్ మంజరి

తూర్పు గోదావరి జిల్లా…

ఆహార పదార్థాలను కల్తీ చేస్తే కఠిన చర్యలు తప్పవని.. చట్టప్రకారం జైలు శిక్ష ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఆహార పదార్థాల కల్తీ నియంత్రణ కమిషనర్ మంజరి వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణంలో పలు సంస్థలను ఆమె తనిఖీ చేసి శాంపిల్స్ సేకరించారు. కాళ్లకూరి నాగబాబుకు చెందిన గోదావరి నేతి తయారీ కేంద్రం, కాళ్లకూరి గొల్లబాబుకు చెందిన సూర్యచంద్ర నేతి తయారీ కేంద్రాలతో పాటు పట్టణంలో కిరాణా, స్వీట్స్ స్టాల్స్, వంట నూనెల గోదాములను తనిఖీ చేశారు. ప్రతినెల ఒక క్యాలెండర్ ప్రకారం పలు సంస్థలను వాటి ఉత్పత్తులను ముడి పదార్థాలను సేకరించి తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వాటి ఫలితాలు క్రోడీకరించి ఎక్కడ కల్తీ జరిగిందో ఆయా సంస్థల పై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. తనిఖీలు కేసులు అనేవి తమ దైనందిక విధి నిర్వహణలో ఒక భాగమని ఇదొక నిరంతర ప్రక్రియ అని ఆమె అన్నారు.
ఒక కన్జ్యూమర్ సంస్థ ఫిర్యాదు మేరకు తాము ఈ ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగిందన్నారు.

రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ వినియోగదారుల సంస్థల నుండి మండపేటలో ఆహార పదార్థాలన్నీ కల్తీ అవుతున్నాయనే ఫిర్యాదు మేరకు తనిఖీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా నేతి తయారీ సంస్థలు కల్తీ చేస్తున్నాయని పలు మిఠాయి వ్యాపార సంస్థలు కల్తీ చేస్తున్నాయని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు వచ్చాయని… జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కృష్ణాజిల్లా ఉభయ గోదావరి జిల్లాల్లో జిల్లా ఫుడ్ కు ఇన్స్పెక్టర్లు తో 7 టీమ్ లు ఏర్పాటు చేసి ఏకకాలంలో మూడు జిల్లాల్లో సోదాలు నిర్వహిస్తున్నామన్నారు. మండపేటలో 15 శాంపిల్స్ సేకరించామని అన్నారు. వీటిని 15 రోజుల్లో ల్యాబ్ కు పంపి వాటి రిజల్ట్ తీసుకొని కేసులు నమోదు చేస్తామన్నారు. తొలుత జాయింట్ కలెక్టర్ కోర్టులో కేసు నమోదు చేస్తామని… మరీ తీవ్రత ఉన్న కేసులను స్థానిక మేజిస్ట్రేట్ కోర్టులో నమోదు చేయడం జరుగుతుందన్నారు.

జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ బి శ్రీనివాస్ మాట్లాడుతూ
గత ఏడాది జిల్లాలో 145 శాంపిల్స్ సేకరించగా ఐదు శాంపిల్స్ సురక్షితం కాదని నివేదిక రాగా ఆయా సంస్థలపై మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. అదేవిధంగా నాణ్యత ప్రమాణాలు తక్కువ ఉన్న సంస్థల పై జాయింట్ కలెక్టర్ వారి కోర్టులో 40 కేసులు నమోదు చేశామన్నారు. వీటిలో 15 కేసులకు సంబంధించి జాయింట్ కలెక్టర్ కోర్టులో ఆరు లక్షలు జరిమానా విధించడం జరిగిందన్నారు. ఈ ఏడాది 40 శాంపిల్స్ పంపగా 5 సురక్షితం కాదని 35 నాణ్యత ప్రమాణాలు తక్కువగా ఉన్నాయని నివేదికలు వచ్చాయన్నారు. 15 సంస్థల పై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *