ఆశా వర్కర్లను సన్మానించుకోవడం సంతోషంగా ఉంది: సినీ నటుడు అభినవ్ సర్కార్
కరోనా సమయంలో రోగులకు సేవలందించిన ఆశా వర్కర్ల సేవలు వెలకట్టలేనివని సినీ నటుడు అభినవ్ సర్కార్ అన్నారు .హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో బియాండ్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లను ఘనంగా సన్మానించారు. పౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన రూపొందించిన ఆశా జ్యోతి పేరుతో రూపొందించిన లఘు చిత్రాన్ని సినీ నటులు విడుదల చేశారు. హోప్ ఫర్ హ్యూమానిటీ లెట్స్ షేర్ హ్యాపినెస్ ప్యాండమిక్ వారియర్ అవార్డ్స్ 2021 పేరుతో నిర్వహించిన ఈ ఈవెంట్‌లో సినీ నటులు,సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు . నిజమైన హీరోలు ఆశా వర్కర్లు అని పలువురు సినీ తారలు అభిప్రాయపడ్డారు. కరోనా సమయంలో ప్రతి ఇంటి డోరుకు వెళ్లి ప్రజలకు సేవలందించారని కొనియాడారు. విఫత్కర సమయంలో ప్రజలకు సేవలందించిన ఆశా వర్కర్లను అవార్డులతో సత్కరించారు.