ఆశాడమాసం బోనాలపై MCR HRD లో ప్రభుత్వం ఈ నెల 25న సమీక్ష

ఆశాడమాసం బోనాలపై ప్రభుత్వం ఈ నెల 25న సమీక్ష

ఆషాడమాసం బోనాల నిర్వహణ, ఏర్పాట్లపై ఈ నెల 25 న మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. . ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, హోం మంత్రి మహమూద్ అలీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మలారెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, DGP మహేందర్ రెడ్డి, పోలీస్ కమిషనర్ లు అంజని కుమార్, మహేష్ భగవత్, సజ్జనార్, వివిధ శాఖల అధికారులు పాల్గొననున్నారు. గత సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా బోనాలను నిర్వాహించుకోలేక పోయినందున ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. తెలంగాణా సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా వివిధ వేశాదారనలతో కళాకారుల ప్రదర్శనలు, త్రీడీ మ్యాపింగ్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కరోనా మహమ్మారిని పారద్రోలాలని కోరుతూ అమ్మవారికి బంగారు బోనం సమర్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్లు పేర్కొన్నారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం వివిధ ఆలయాలకు ఆర్ధిక సహాయం అందించేందుకు 15 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. జులై 11 న గోల్కొండ బోనాలు, 25 వ తేదీన సికింద్రాబాద్ బోనాలు, ఆగస్టు 1 వ తేదీన హైదరాబాదు బోనాల ఉత్సవాలు నిర్వహిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *