అవయవదానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి : బండి సంజయ్

అవయవదానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి : బండి సంజయ్

అవయవ దానం వల్ల చనిపోయినా మరో పదిమందికి జీవితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ పార్క్ హయత్ లో బిజెపి నేత గూడూరు నారాయణరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఆర్గాన్ డోనర్స్ అసోసియేషన్ లోగో బండి సంజయ్ ,కాంటినెంటల్ హాస్పిటల్స్ ఛైర్మన్ గురునాథ్ రెడ్డి ,ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియాలు ఆవిష్కరించారు. జీఎన్ఆర్ ఫౌండేషన్ పేరిట నేను 15 ఏళ్ల్లుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని బిజేపీ సీనియర్ నేత గూడూరు నారాయణరెడ్డి అన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో అవయవదానం కోసం ఎంతో మంది వేచి చూస్తున్నారని చెప్పారు. బయట రాష్ట్రాల నుంచి అవయవాలు తెప్పించడం తరచు చూస్తున్నామని గుర్తు చేశారు. మన దేశంలో ,మనరాష్ట్రంలో అవయవదానం పై అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. అవయవదానంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి అసోసియేషన్ కృషి చేస్తుందన్నారు.

భారత్‌లో అవయవ దానం గురించి పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన లేదని బిజేపీ సీనియర్ నేత గూడూరు నారాయణరెడ్డి అన్నారు.

తెలంగాణ ఆర్గాన్ డోనార్స్‌ అసోసియేషన్ ఏర్పాటు చెయ్యడం ఆభినందనీయమని కాంటినెంటల్ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ గురునాధ్ రెడ్డి అన్నారు. ప్లాస్మా దానం చేసి వేల మంది ప్రాణాలను కాపాడారంటూ గూడూరు నారాయణరెడ్డి అవయదానం కోసం అసోసియేషన్ ఏర్పాటు చేయడం ఆహ్వానించదగ్గ విషయమన్నారు. భారత్‌లో ఇప్పటి వరకు 15వేలు మాత్రమే అవయవదానం జరిగింది, అమెరికాతో పోలిస్తే ఇది చాలా తక్కువ అన్నారు.
దేశంలో దాదాపు అయిదు లక్షల మంది ఏటా అవయవదానం కోసం వేచిచూసి చనిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కువగా గుండె, కిడ్నీ, కాలేయ బాధితులే ఉన్నారని తెలిపారు.

అవయవ దానం అవసరాన్ని గుర్తించి ఈ సేవలను గూడూరు నారాయణ రెడ్డి ప్రారంభించడం సంతోషకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గూడూరు నారాయణరెడ్డి అవయవ దానం సేవలు ప్రారంభించడం అభినందనీయమన్నారు.కోవిడ్ సమయంలో… ప్లాస్మా డోనర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి దాదాపు 9వేల మంది కరోనా భాదితులకు సేవలు అందించారని చెప్పారు. అవయవ దానానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి బండి సంజయ్ పిలుపునిచ్చారు.పుట్టడం ఎంత గొప్ప విషయమూ చనిపోయిన తర్వాత కూడా పది మందికి అవయవదానం చెయ్యడం అంతే గొప్ప విషయమన్నారు. కుటుంబం సభ్యుల్లో బందువుల్లో మార్పు తెచ్చి అవయవదానంపై అవగాహన కల్పించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *