అంతర్జాతీయ గోల్ఫ్ టోర్నమెంట్ కు వేదికైన హైదరాబాద్

హైదరాబాద్ లో అంతర్జాతీయ గోల్ఫ్ టోర్నమెంట్ కు వేదిక అయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారిగా జరుగుతున్న అంతర్జాతీయ గోల్ఫ్ టోర్నమెంట్ ను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది . దేశ విదేశాల్లో అనేక మంది ప్రముఖులు, గోల్ఫ్ ప్రపంచ స్థాయి క్రీడాకారులు చాలామంది పెద్ద పెద్ద కార్పోరెట్ సంస్థల CEO లు, CFO లు ఈ టౌర్నమెంట్ లో హాజరుకానున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ఖ్యాతి ప్రతిబింబించేలా గోప్ప కార్యక్రమాన్ని నిర్వహించేలా టౌర్నమెంట్ సన్నాహాక ఏర్పాట్ల పై రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ గారి అధ్యక్షతన కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది.

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో అన్నిరంగాల్లో అధ్బుతమైన ప్రగతి సాధిస్తున్న నేపద్యంలో క్రీడారంగంలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దెందుకు కృషిచేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో గోల్ఫ్ క్లబ్ కు ప్రక్కనున్న ఇరిగేషన్ ట్యాంక్ ను బ్యూటిఫికేషన్ చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు వరద నీరు, మురికినీటి ని డైవర్ట్ చేసి దానిని మెట్రో వాటర్ వర్క్స్ , జిఎచ్ఎంసి పరిదిలోని రోడ్డును దాన్ని బ్యూటిఫికేషన్ కోసం మూడు శాఖల అధికారులతో సమన్వయం చేసుకోని ప్రతిపాదనలు రూపోందించుకోవాలన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గోల్ఫ్ క్లబ్ ను కెటిఆర్ ప్రారంబించడం జరిగింది. ప్రపంచంలో ఏక్కడ లేని విధంగా అద్భుతమైన దృశ్యంగా, అద్బుతమైన చారిత్రాత్మక ప్రాంతంగా వుంది. డీల్లి, బెంగుళూరు లో కంటే హైదరాబాద్ లోని గోల్ఫ్ క్లబ్ అద్భుతంగావుందని పలువురు జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు కితాబిచ్చారన్నారు మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ . తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడలలో పెద్ద పాత్ర వేసి అనేక క్రీడా మైదానాలు నిర్మించడం జరుగుతుందన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ఓలంపిక్స్ లో పథకాలు సాదించే క్రీడాకారులను ప్రోత్సహకాలను అందిస్తామన్నారు. వీటి వల్ల జాతీయ స్థాయిలో టూరిజం అభివృద్ది జరిగే అవకాశం ఉందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ . అనేక మంది ఇంటర్ నేషనల్ టూరిస్టులు హైదరాబాద్ కు రావడం వల్ల టూరిజం కు అవకాశం ఉంటుందని వెల్లడించారు.

చాలా మంది ప్రముఖులు ఈ ప్రాంతాన్ని యునేస్కో గుర్తింపు ప్రాంతంగా అయ్యే అవకాశం ఉందని సమావేశంలో చర్చకు రావడం జరిగిందన్నారు. రామప్ప దేవాలయం యునేస్కో గుర్తింపు తర్వాత గోల్కోండ కోట, గోల్ఫ్ క్లబ్ ల యునేస్కో గుర్తింపు కు కృషి చేయాలని ఈ సమావేశంలో చర్చించటం జరిగిందన్నారు. 10 రోజుల్లో ప్రతిపాదనలు సిద్దంచేసుకోని వివిధ కార్యక్రమాల అమలు పై రాష్ట్ర పట్టణాభివృద్ది , పరిశ్రమల శాఖల మంత్రి కెటిఆర్ తో సమావేశం ఏర్పాటు చేసుకోని అక్టోబర్ 2022 నాటికి పూర్తి స్థాయిలో టౌర్నమెంట్ నిర్వాహణ పనులును పూర్తిచేసుకోవాలని మంత్రి ఈ సమావేశంలో గవర్నింగ్ బాడీ సభ్యులకు సూచించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో క్రీడల అభివృద్ది కి అనేక కార్యక్రమాలను నిర్వహించటం ఎంతో సంతోషంగా ఉందన్నారు గోల్ఫ్ క్లబ్ గవర్నింగ్ బాడీ సభ్యులు. గోల్ఫ్ టౌర్నమెంట్ ద్వారా తెలంగాణ ఖ్యాతి ని ల అంతర్జాతీయ వేదికలపై మరింత ఇనమడింపజేసేందుకు కృషి చేస్తామన్నారు మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ .

ఈ సమీక్షా సమావేశంలో గోల్ఫ్ క్లబ్ గవర్నింగ్ సభ్యులు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రభుత్వ కార్యదర్శి KS శ్రీనివాస రాజు, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, తెలంగాణ టూరిజం MD మనోహర్, కేంద్ర పురావస్తు శాఖ రీజినల్ డైరెక్టర్ డా. స్మిత S. కుమార్, హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, సెక్రటరీ BVK రాజు, కెప్టెన్ భాస్కర్ రెడ్డి, ASI, టూరిజం శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *